Header Banner

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పెమ్మసాని.. తన ఆలోచనలకు నేనూ స్ఫూర్తి పొందాను! ఆయన చేస్తున్న సేవలు అమూల్యమైనవి!

  Sun Apr 20, 2025 19:14        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి కేంద్ర సహాయ మంత్రి, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో చాలామందికి చంద్రబాబు ఫీజులు కడుతుంటారని తెలిపారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన ఎంతో మంది తెలుగు విద్యార్థులకు చంద్రబాబు ఆర్థికంగా అండగా నిలిచారని, వారి ఫీజులు చెల్లించి ఆదుకున్నారని పెమ్మసాని పేర్కొన్నారు. అయితే, ఈ సహాయం గురించి చాలామందికి తెలియదని, ఒకరిద్దరికి మాత్రమే తెలుసని అన్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పెమ్మసాని ఈ విషయాలు వెల్లడించారు.. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ... చంద్రబాబు కేవలం రాజకీయ నాయకుడే కాదని, ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన మార్గదర్శి అని కొనియాడారు. ముఖ్యంగా అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వచ్చి, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిస్తే చంద్రబాబు వెంటనే స్పందించేవారని తెలిపారు. అనేక మంది విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించి వారి చదువులకు ఆటంకం కలగకుండా చూశారని వివరించారు. ఇది ఆయన సేవా దృక్పథానికి, విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు.


ఇది కూడా చదవండి: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయులకు మంత్రి లోకేష్ కానుక! 10 గం. లకు మెగా డీఎస్సీ ప్రకటన!



అంతేకాకుండా, చంద్రబాబును 'నిలువెత్తు నిఘంటువు' (Living Dictionary) గా అభివర్ణించిన పెమ్మసాని, ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా అమెరికాలో స్థిరపడే సమయంలో ఆ స్ఫూర్తి ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. అమరావతి వంటి బృహత్తర ప్రాజెక్టును చేపట్టాలనే సంకల్పం, శ్రమదానం, జన్మభూమి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వంటివి ఆయన దార్శనికతకు నిదర్శనాలని కొనియాడారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెడల్పు విషయంలో చంద్రబాబు దూరదృష్టిని పెమ్మసాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రం 70 మీటర్ల వెడల్పుకు అనుమతిస్తే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా దాన్ని 140 మీటర్లకు పెంచాలని చంద్రబాబు పట్టుబట్టారని, ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో అర్ధరాత్రి ఒంటిగంటకు సమావేశమై ఒప్పించారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ముందుచూపు, పట్టుదల తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన ప్రసంగాలతో కూడిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఏపీ అసెంబ్లీ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూనే పైవ్యాఖ్యలు చేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuNaidu #PemmassaniChandrashekhar #BirthdayWishes #VisionaryLeader #PricelessService